తెలుగు స్వరచక్రస్వరచక్ర-తెలుగు

“జీవితంలో ధనం నష్టపోతే, కొంతకోల్పోయినట్టు, కానీ ప్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే... స్వామి వివేకనంద.”ఈ తెలుగు వాక్యాన్ని మీ పరికరం స్పష్టంగా ప్రదర్శిస్తే, మీ పరికరంలో స్వరచక్ర- తెలుగు విలక్షణముగా పని చేస్తుంది. ఒకవేళ అక్షరాలలో స్పష్టత లేకపోయినా లేక అక్షరాలు కనిపించకపోయిన మీ పరికరంలో స్వరచక్ర సరిగా పనిచేయకపోవచ్చు.


స్వరచక్ర తో టైపింగ్

తెలుగు లిపి లో, హల్లులు (క) మరియు ఒత్తుల (ొ) కలయిక, ఉదాహరణకు క + ొ = కొ తరచుగా టైప్ చేయాలి. మీరు ఒక హల్లు(క) తాకినప్పుడు, హల్లులు మరియు పది తరచుగా వాడే ఒత్తుల కలయిక తో ఒక చక్రం వస్తుంది(క్, కా, కి, కీ, కు, కూ, కె, కే, కొ, కో). ఈ చక్రం సాధ్యమైన అన్ని గుణింతాలు చూపిస్తుంది. ఇప్పుడు కావలిసిన అక్షరం వైపు మీ వేలునో లేక స్టైలస్నో స్లైడ్ చేయండి .

సాధారణంగా మొబైల్లో “క్క, క్ష, క్త” వంటి అక్షరాలు వ్రాయటం కష్టం అనిపిస్తుంది, కానీ స్వరచక్రతో ఇప్పుడు ఇది చాలా సులభం. మొదటిగా కీప్యాడ్పై చక్రం నుంచి కావలిసిన అచ్చుని(క + ్ ) తాకండి, అప్పుడు కీప్యాడ్పై ఆ అచ్చుతో వ్రాయగలిగే అన్ని సంధులు(క + ్ + త= క్త , ఙ + ్ + ఞ = ఙ్ఞ ) వస్తాయి. ఇప్పుడు మీకు కావలిసిన అక్షరంపై తాకండి. అధనంగ ఆసంధికి వత్తూలు పెట్టాలంటే మొదటిలాగ కొత్తచక్రాన్ని ఉపయోగించి వ్రాయండి.

వ్రాయటానికి కష్టం అనిపించే మరొక ఉదాహరణ " జ్యోత్స్న ", ఇది ఇలా వ్రాయబడుతుంది (జ్య + ో = జ్యో) + (త్స + ్ + న = త్స్న) = జ్యోత్స్న. పూర్తి హల్లులు వాడటానికి వేరోక చక్రం అందుబాటులో ఉంది ,దానికోసం కీప్యాడ్పై 'అ' అన్న అక్షరంపై తాకండి. అధిక హల్లులు(ఐ, ఔ) కేప్యాడ్ పైన 'అ' అక్షరం పక్కనే ఉంటాయి. అరుదుగా వాడే హల్లులు మరియు ఒత్తులు ' ఋ' అక్షరంపై తాకితే చక్రంలో వచ్చును.

అంకెలు మరియు చిహ్నాలు షిఫ్ట్ బటన్ తాకితే వచ్చును. మీరు మధ్యలో ఆంగ్లంలో వ్రాయాలనుకుంటే తాత్కాలికంగా క్వెయర్టీ కీప్యాడ్కి మారవచ్చు.


స్వరచక్ర ఇన్స్టాల్ చేయటం

Iస్వరచక్ర-తెలుగు ఇన్స్టాల్ చేయటానికి పైన ఉన్న ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేసి క్రింద సూచించిన విధానం అనుసరించండి.

  1. మీ పరికరంలోని సెట్టింగ్స్ విభాగానికి వెళ్లండి.
  2. ఇప్పుడు "భాష మరియు ఇన్పుట్" విభాగంలో “తెలుగు స్వరచక్రం” (Swarachakra Telugu) అనే ఆప్షన్ని ఎంపిక చేయండి.
  3. చివరిగా,స్వరచక్రని మీ స్వయంసిద్ధ(డిఫాల్ట్) కీబోర్డ్ చేయటానికి "కీబోర్డ్ మరియు ఇన్పుట్ ల్యాంగ్వేజ్" విభాగంలోని "డిఫాల్ట్" ఆప్షన్లో "స్వరచక్ర తెలుగు" ని ఎంపిక చేయండి.

గమనిక: స్వరచక్ర ఆండ్రాయ్డ్4.0(ఇసీఎస్) మరియు పైబడిన సంస్కరణలు కోసమే రూపొందించబడినది, కావున ప్రస్తుతం ఉనికోడ్ మద్దతు లేనందున పాత ఆండ్రాయ్డ్ సంస్కరణాలలో స్వరచక్ర పనిచేయదు.
Contact Us

For any queries and suggestions, contact us.